Sunrisers Hyderabad (SRH) defeat Delhi Capitals (DC) by 5 wickets at Ferozshah Kotla ground in New Delhi on Thursday. Chasing a modest total of 130, SRH were off to a flying start, thanks to Jonny Bairstow. However, wickets did fall but it was a little too late for the home team. With this win, SRH have climbed to the top of the VIVO IPL points table.
#IPL2019
#SunrisersHyderabad
#DelhiCapitals
#bhuvaneswarkumar
#davidwarner
#JonnyBairstow
#cricket
ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయం సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో విజయం కాగా... ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 130 పరుగుల విజయ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సన్‌రైజర్స్ ఓపెనర్లలో జానీ బెయిర్ స్టో (48; 28 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ బౌలర్లలో లమిచానే, అక్షర పటేల్, రబాడ, తెవాటియా, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.